ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, వినయ్, రాజేశ్ లపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు.

రెండు సెంట్ల భూమిని ఆక్రమించారనే ఆరోపణ ఉందన్నారు.ఆ భూమిపై ఫేక్ ఎన్ఓసీ తీసుకొచ్చారని పేర్కొన్నారు.

సదరు ఎన్ఓసీపై ఉన్న సంతకం ఏఈది కాదని వెల్లడించారు.ఆ కేసులో ఏ1గా అయ్యన్నపాత్రుడు, ఏ2గా విజయ్, ఏ3గా రాజేశ్ లు ఉన్నారని తెలిపారు.

దీనిలో భాగంగానే అయ్యన్నపాత్రుడు, రాజేశ్ లను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players