బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ లో కీలక అంశాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక అంశాలను పొందుపరిచారని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సమన్లను రద్దు చేయాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ తనను వేధిస్తోందని కవిత ఆరోపించారు.తన విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని వాపోయారు.

ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఎక్కడ తన పేరు లేదని చెప్పారు.కొద్దిమంది వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇరికించారన్నారు.

అరుణ్ పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు.పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement

తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్ మెంట్లకు విశ్వసనీయత లేదని వెల్లడించారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు