HMDA Former Director Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

వేలానికి ముందే రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారనని తెలుస్తోంది.ఈ క్రమంలో పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారని విచారణలో తేలింది.

ఈ క్రమంలో వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ( ACB )అందజేసింది.ఈ క్రమంలో వేలంపాటను ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

అదేవిధంగా హెచ్ఎండీఏ( HMDA )లో పలువురు అధికారుల పాత్రపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు