ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి.
ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నేతలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేస్తుంది.
"టీడీపీ.జనసేన.బీజేపీ" పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.2024 ఎన్నికలకి సంబంధించి ఏపీలో 2014 పొత్తుల వాతావరణం కనిపిస్తుంది.2014 కంటే ఇప్పుడు రాష్ట్రంలో కొద్దిగా కాంగ్రెస్ బలపడటంతో పాటు షర్మిల అధ్యక్షురాలు కావడంతో.ఆ పార్టీకి ప్లస్ అయ్యింది.
ఈ క్రమంలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది.
ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి.ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది.పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) కీలక వ్యాఖ్యలు చేశారు.
నేడో రేపో వైసీపీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం జరిగింది.ఈనెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలియజేశారు.
వచ్చే ఎన్నికలలో కూటమి తరపునే నరసాపురం పార్లమెంటు( Narasapuram Parliament ) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.ఏ పార్టీ నుంచి పోటీ చేసేది అనేది త్వరలో చెబుతానని వెల్లడించడం జరిగింది.2019 ఎన్నికలలో నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడం జరిగింది.
ఈ క్రమంలో 2024 ఎన్నికలలో "తెలుగుదేశం జనసేన బీజేపీ" కూటమి నుండి పోటీ చేయబోతున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించడం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy