ఏపీ పర్యాటక.సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు.ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని అధికార యంత్రాంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
పర్యాటక ప్రాంతాలుగా( Tourist Places ) విరజిల్లాల్సిన ప్రాంతాలను గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజానీకం వైకాపాకి గట్టిగా బుద్ధి చెప్పారని పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.
సినిమా షూటింగులకు( Movie Shootings ) అనుగుణంగా కోనసీమ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.సినిమా షూటింగులు పెరిగేలా చర్యలు తీసుకుంటాం.ఏపీలో స్టూడియోల నిర్మాణం( Studios ) కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేయడం జరిగింది.కందుల దుర్గేష్ నేడు సాయంత్రం 5:50 నిమిషాలకు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ₹2.31 కోట్ల అంచనా వ్యాయాయంతో పది టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy