తెలంగాణ‌లో కానిస్టేబుల్ రాత ప‌రీక్ష తేదీలో కీల‌క మార్పు

తెలంగాణ‌లో కానిస్టేబుల్ రాత ప‌రీక్ష తేదీ వాయిదా ప‌డింది.

ఈనెల 21న జ‌ర‌గాల్సిన ప్రిలిమిన‌రీ ప‌రీక్షను ఈనెల 28న నిర్వ‌హించాల‌ని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది.

సాంకేతిక కార‌ణాల దృష్ట్యా ప‌రీక్ష‌ను వాయిదా వేసిన‌ట్లు వెల్ల‌డించింది.అయితే, ఈ కానిస్టేబుల్ ప‌రీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.50 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ స‌హా 40 ప‌ట్ట‌ణాల్లో ఎగ్జామ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు నియామ‌క బోర్డు అధికారులు తెలిపారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు