గుడ్డలూడదీసి కొడతా ..! ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన కేతిరెడ్డి ?

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,  నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని ప్రతి పల్లె , పట్టణం తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

  జగన్ సైతం అనేక సందర్భాల్లో కేతిరెడ్డి ని మెచ్చుకున్నారు.

ప్రజల నాడి పట్టిన ఎమ్మెల్యేగా ఆయనపై జగన్ అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రోల్ మోడల్ గా కేతిరెడ్డి కొనసాగిస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమమే స్ఫూర్తి అనే ప్రచారం కూడా వైసీపీలో ఉంది.

సోషల్ మీడియాలోనూ కేతిరెడ్డి కి మంచి ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే ధర్మవరం నియోజకవర్గం లోని తన రాజకీయ ప్రత్యర్థులపై కేతిరెడ్డి ఉగ్రరూపం ప్రదర్శించారు.

వైసిపి నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన ఆయన ఘాటు పదజాలంతోనే ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తో పాటు , ఆయన వర్గీయులు గత కొద్ది రోజులుగా కేతిరెడ్డి పై అనేక విమర్శలు చేస్తున్న క్రమంలో కేతిరెడ్డి వారికి గట్టిగానే హెచ్చరికలు చేశారు.

Advertisement

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

ఇప్పుడు బిజెపి లో ఉన్నావ్.టిడిపిలోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటున్నావ్.టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున కళాజ్యోతి సెంటర్ లో గుడ్డలుడదీసి కొడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీరు గెలిచినా.ఓడినా అంతా అస్సాం.

రైలెక్కి కనిపించకుండా పోతారు.నేను ఓడినా, నెగ్గినా ప్రజల మధ్యనే ఉంటా.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

వాళ్లు గెలిస్తే ఆరు నెలల్లో నా కాళ్లు చేతులు విరిచేస్తానని చెప్పారు.నన్ను కొట్టి చూడు.

Advertisement

పొలిమేర కూడా దాటలేరు " అంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు.తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని , రోడ్డు వేస్తే కూడా భూకబ్జా అంటారా అంటూ ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు