అప్పుడు లావణ్య ఇప్పుడు కేతిక.. హస్బెండ్ మెటీరియల్ అంటూ మెగా హీరో పై ప్రశంసలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం( Mega Family ) నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి సుప్రీమ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాయి తేజ్ అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన గురించి ఈయనతో పని చేసిన వారు ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.

ఇక ఈయనతో కలిసి పని చేసినటువంటి సెలబ్రిటీలను కనుక మనం ప్రశ్నిస్తే సాయి తేజ్ గురించి ఏదో ఒక ట్యాగ్ ఇస్తూ ఉంటారు.

సాయి ధరమ్ తేజ్ తో కలిసి గతంలో నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈమెను ఒక ఇంటర్వ్యూలో హస్బెండ్ మెటీరియల్ (Husband Material) ఎవరు అంటూ వరుణ్ తేజ్ (Varun Tej) సాయి తేజ గురించి ప్రశ్నించగా వరుణ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ కానీ సాయి తేజ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అంటూ ఈయన గురించి కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఒకప్పుడు లావణ్య త్రిపాఠి ఈయన పై ప్రశంసలు కురిపించగా తాజాగా నటి కేతిక శర్మ(Kethika Sharma) కూడా సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

కేతిక శర్మ సాయి తేజ్ తో మాత్రమే కాకుండా వైష్ణవ్ తేజ్ తో కలిసి సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఈ ఇద్దరు హీరోల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.వీరిద్దరిలో ఎవరు హస్బెండ్ మెటీరియల్ అంటూ ప్రశ్న ఎదురు కావడంతో సాయి తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ కేతిక కామెంట్ చేశారు.

ఇక వీరిద్దరు కూడా చాలా స్వీట్ అని ఈమె తెలియజేశారు.ఇక వైష్ణవ్ తో అయితే నేను చాలా సరదాగా ఉండేవాడినని ఇద్దరు చిన్నపిల్లలు మాదిరి కొట్టుకునే వాళ్ళం అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు