రైతులకు భారీ రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేశినేని నాని

ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు భారీ రాయితీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని).

రైతు రథం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షులు మాజీమంత్రి శ్రీ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.దేశానికి వెన్నుముక రైతు.

అటువంటి అన్నదాతకు సాయం చేయడం దేశాభ్యున్నతికి పాటుపడడమే.ఒక్కో ట్రాక్టర్ పై 1.40 లక్షలు రాయితీతో మొదటి విడతలో 25మంది రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నాము.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతు రథాల పేరిట భారీ సబ్సీడీ తో చంద్రబాబు రైతులకు ట్రాక్టర్లు అందించాం.

చిన్న,సన్న కారు రైతులకి లబ్ధి చేకూర్చాలి అనే ఉద్దేశంతో ట్రాక్టర్ తయారీ సంస్థలతో మాట్లాడి రైతులకు లబ్ది చేకూర్చే కార్యక్రమం చేపట్టాం.దాదాపు వెయ్యి మంది రైతులకు ట్రాక్టర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం.2014 to 2019 తెలుగుదేశం ప్రభుత్వం లో పోలవరం, పట్టిసీమ చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు గారు, వ్యవసాయ ఆధారిత ఆదాయం పెంచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు ఈ దేశానికి వెన్నుముక కానీ రైతు ప్రతి సందర్భంలోనూ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అతివృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నాడు , అనావృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నాడు.

Advertisement

ప్రకృతి వైపరీత్యాలు వల్ల, అనేక రకాల కొత్తగా వచ్చే తెగుళ్లు వల్ల, ఎరువులు అధిక ధరల వల్ల ఇబ్బంది పడుతున్నాడు.రైతు పంట పండించిన తర్వాత పంట ధర పడిపోవటం వల్ల పూర్తిగా నష్టపోతున్నాడు.

ఏ విధంగా చూసినా దేశంలో రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది.వ్యవసాయంలో రైతుకు అన్ని విధాల ఉపయోగపడే కీలకమైన ట్రాక్టర్లను సబ్సిడీతో గతంలో 600 కు పైగా ట్రాక్టర్లు ను రైతులకు అందించాం.

మరోసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం కాబట్టి రైతులు కులాలకి ,మతాలకి ,ప్రాంతాలకి అతీతంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు, సీనియర్ నాయకులు యలమంచిలి గౌరంగ బాబు, కోగంటి రామారావు, NTR జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య, M.S బేగ్, విజయ్ బాబు గారు,కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మినేని ప్రసాద్ చెన్నుపాటి గాంధీ, మహంతి వాసుదేవరావు, గొగుల రమణ, గండూరి మహేష్, గుమ్మడి గురు ప్రసాద్, షేక్ మొహిద్దిన్, రాయల లీల ప్రసాద్, కోనేరు రాజేష్, దాసరి మల్లేశ్వరి, పొన్నం రవి,షేక్ వహీద్, గడ్డి కృష్ణారెడ్డి, పెద్దాపురం మధు, వాసిరెడ్డి ప్రసాద్, నర్రంనేని మురళి, దాసర ప్రభు, పట్టయ్య, మన్నెం శ్రీను, కొల్లిఅప్పారావు, రావురి సాయి, రాఘవాపురం శివయ్య, ఎక్కిరాల హనుమంతరావు, చిన్నసుబ్బయ్య , ఐలా మాజీ అధ్యక్షులు ఫౌండ్రి ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్ర బీసీ నాయకులు పేరపి ఈశ్వర్ , ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కాకు మల్లికార్జున యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు విశ్రం డానియల్, పరిశపోగు రాజేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ అమానుల్లా, షేక్ కరిముల్లా, హజరత్ , సుంకర కృష్ణమోహన్, దొడ్డ లక్ష్మణరావు, బొమ్మసాని ఉమా మహేష్, కందిమల్ల శేషగిరిరావు, కీసర వేణుగోపాల్ రెడ్డి, మైలవరం మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు, ప్రధాన కార్యదర్శి చల్లా సుబ్బారావు, తెలుగుత రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది ప్రపుల్లచంద్ర, పిట్టా చైతన్య, వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు, ఐ టి డి పి అధ్యక్షుడు అద్దేపల్లి శివ, విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, సీనియర్ నాయకులు దూది బ్రహ్మయ్య, పిల్లాసుదర్శన్, సుభాని, గంగాధర్, నాగు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ సెక్రటరీ వసీం అక్రమ్, మైనారిటీ నాయకులు షేక్ హబీబ్, కరీముల్లా ,ఇమ్రాన్ అజీజ్ ఫయాజ్, సోను తెలుగు యువత నాయకులు తన్నీరు అజయ్,బుడ్డి జగన్ , దొడ్డ కిట్టు, బెజవాడ నాని, మల్లవరపు చైతన్య,సాదం నరసింహ యాదవ్, మాధవ, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు