కీరవాణి హాలీవుడ్‌... రెహమాన్‌ మాదిరిగా ఆస్కార్‌ ఉపయోగించుకుంటాడా?

నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న కీరవాణి( Keeravani ) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన సంగీత దర్శకుడు.

గ్లోబల్‌ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న కీరవాణి కి కావాలంటే హాలీవుడ్‌ నుండి కూడా ఆఫర్లు వస్తాయి.

బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ ఈయన చేయాలి అనుకుంటే వెంట పడుతారు.కానీ కీరవాణి మాత్రం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే సంగీతాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆయన ఎంత వరకు బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తాడు అనేది క్లారిటీ లేదు.ఇదే సమయంలో ఆయన హాలీవుడ్ ( Hollywood )అవకాశాలను ఎంత వరకు అంది పుచ్చుకుంటాడు అనేది కూడా క్లారిటీ లేదు.

మొత్తానికి కీరవాణి సంగీతం సౌత్‌ ఇండియా వరకే పరిమితం అవ్వబోతుందా లేదా హాలీవుడ్‌ రేంజ్ లో సందడి చేస్తుందా అనేది తెలియాలి అంటే కచ్చితంగా మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.స్లమ్‌ డాగ్‌ మిలియనీర్ సినిమా తో ఆస్కార్ ను దక్కించుకున్న సంగీత దర్శకుడు రెహమాన్ ఆ తర్వాత హాలీవుడ్ లో ఏ స్థాయి లో సందడి చేశాడో అందరికి తెల్సిందే.

Advertisement

అందుకే కీరవాణి కూడా హాలీవుడ్‌ లో హడావుడి చేస్తాడేమో అనుకున్నారు.కానీ ఇప్పటి వరకు కీరవాణి ఆ విషయమై స్పందించడం లేదు.రెహమాన్ తరహాలో హాలీవుడ్ ఆఫర్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు.

కనుక ముందు ముందు కూడా కీరవాణి నాటు నాటు( Natu Natu ) పాటలనే తెలుగు లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.మరో వైపు రాజమౌళి మాత్రం వరుసగా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.

త్వరలో మహేష్ బాబు తో సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్న రాజమౌళి తదుపరి సినిమా కచ్చితంగా హాలీవుడ్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.హీరోలు ఎవరు అనే విషయం పక్కన పెడితే అప్పుడు కీరవాణి హాలీవుడ్ సినిమాకు సంగీతాన్ని ఇస్తాడేమో చూడాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు