ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ సంచలన నిర్ణయాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రులు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులను కలవాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా వరి ధాన్యం అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు విషయంలో కేంద్రం దగ్గర క్లారిటీ తీసుకోవడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించుకోవడం జరిగిందట.యాసంగి వరి ధాన్యం కొనుగోలు పై.కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న కెసిఆర్ రైతులు ఏ పంట వేయాలి అనేదానిపై కేంద్ర పెద్దలను అడగనున్నారట.కృష్ణా .గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ వాటా తేల్చాలని, ఏపీ తెలంగాణ నీటి వాటా తేల్చేందుకు ట్రిబ్యునల్ రిఫర్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.అదే రీతిలో కొత్త విద్యుత్ చట్టాన్ని.

KCR Sensatational Decisions In Delhi Tour, KCR, Delhi-ఢిల్లీ పర

వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ ప్రతిపాదించనునట్లు సమాచారం.అదే రీతిలో రైతు సమస్యలపై విభజన చట్టాలపై కూడా కెసిఆర్ ఫోకస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయాలపై ఢిల్లీ పర్యటనలో మంత్రులతో పాటు అధికారులు కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను పెద్దలను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
ఇంద్రకీలాద్రి పై రెండవ రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ..

తాజా వార్తలు