తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలతో రాజకీయం రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ పార్టీ తెలంగాణలో బలపడటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో రాజాసింగ్ లాంటి నేతలు తెలంగాణలో రానున్న రోజుల్లో బుల్డోజర్ లు రానున్నాయని ఆ బుల్డోజర్ లు కారును తొక్కి పడేయనున్నదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనం రేపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో త్వరలో తెలంగాణలో బుల్డోజర్ లు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది.దీనిపై మీ స్పందన ఏంటి అనే దానిపై కెసీఆర్ ను ఓ విలేఖరి ప్రశ్న అడగగా దానికి కెసీఆర్ స్పందిస్తూ బుల్డోజర్లు ఏదో కూలి పని చేసుకోవడానికి వస్తున్నట్టుంది అని వెటకారంగా ఇచ్చిన సమాధానానికి ఒక్కసారిగా అందరూ ఘొల్లున నవ్వడమే కాదు అదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో వైరల్ గా మారింది.
అయితే దీనిపై బీజేపీ నాయకులు స్పందిస్తూ మూడు రాష్ట్రాలలో బీజేపీ భారీ విజయంతో కెసీఆర్ కు పిచ్చి పట్టిందని ప్రజలు కెసీఆర్ ను గద్దె దింపి బీజేపీని గద్దెనెక్కనీయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఏది ఏమైనా బీజేపీని చాలా వ్యూహాత్మకంగా బలహీన పరుస్తూ వచ్చే ఎన్నికల్లో 104 నుండి 105 సీట్లు గెలుస్తామని చెబుతూ ఒకరకంగా టీఆర్ఎస్ మరల అధికారంలోకి రాబోతుందనే ఒక బలమైన సంకేతాల్ని ప్రజల్లోకి పంపిస్తూ అదే వ్యూహంతో ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటూ మరల ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
మరి ఈ బుల్డోజర్ డైలాగ్ ఎంత మేరకు ఎన్నికల్లో ప్రజల దృష్టి మారాల్చడానికి బీజేపీ ఉపయోగిస్తుందనేది చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy