గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది..? కారు రివర్స్ అవుతోందా ..?

తెలంగాణాలో తనకు ఎదురులేకుండా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బడా నేతలతోపాటు చోటామోటా నాయకులను కూడా కారెక్కించేసి పార్టీని జంబోజెట్ చేసేసాడు.

అంతే కాదు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో మళ్ళీ అదే వ్యూహానికి పదునుపెట్టి కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకుని సంబరపడ్డాడు.

అయితే ఇప్పుడు మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ పధకం బెడిసికొట్టేలా ఉండడంతో గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది.

Kcr Operation Akarsh Reverse

ముఖ్యంగా టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు తిరిగి సొంత‌గూటికి చేర‌బోతున్నారా? అంటే అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.డిఎస్ దారిలోనే మ‌రికొంద‌రు నేత‌లు కాంగ్రెస్‌లోకి చేరేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది.డిఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్ద‌ల‌ను క‌లిశారు.

త‌న త‌న‌యుడు సంజ‌య్‌కి నిజామాబాద్ అర్బ‌న్ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు రెడీ అని సంకేతాలు ఇచ్చారు.డిఎస్ ఒక్క‌రే కాదు.

Advertisement
Kcr Operation Akarsh Reverse-గులాబీ పార్టీలో ఏం

మ‌రికొంద‌రు నేత‌లు రాబోయే రోజుల్లో పార్టీ మారేందుకు రెడీ అని కాంగ్రెస్ హైకమాండ్ కి సంకేతాలు పంపించారు.డీఎస్ కనుక కాంగ్రెస్ లో చేరడం ఖాయం అయితే.

ఆయనతోపాటు ప‌టాన్‌చెరువు నేత నందీశ్వ‌ర్‌గౌడ్ కాంగ్రెస్‌లోకి వ‌స్తార‌ని తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ భూప‌తిరెడ్డి పై వేటు ప‌డితే ఆయ‌న పార్టీ మారుతారు.

వ‌రంగ‌ల్ ఈస్ట్ టికెట్‌పై కొండాసురేఖ‌,బ‌స్వరాజు సార‌య్య మ‌ధ్య పోటీ ఉంది.అయితే కూతురి కోసం భూపాల‌ప‌ల్లి టికెట్‌ను కొండా దంప‌తులు అడుగుతున్నారు.

వీరిలో ఎవ‌రికి టికెట్ రాకపోయినా పార్టీ మారేందుకు ఏమాత్రం సంకోచించేది లేదని కొండా దంపతులు కుండబద్దలుకొట్టేస్తున్నారు.అలాగే బ‌స్వ‌రాజు సార‌య్య కూడా త‌మ పాత దోస్తులతో ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఆమె ఇండియానా.. నమ్మలేకపోతున్నా.. వియత్నాంలో ఓ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!

ఆదిలాబాద్ జిల్లాలో కూడా పాత కాంగ్రెస్ నేత‌లు ప‌క్క చూపులు చూస్తున్నారు.రానున్న రోజుల్లో ఇది మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

టీఆర్ఎస్ అధినేత ఏదో జరుగుతుందని ఆశిస్తే ఇంకేదో జరుగుతోంది.మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ కాస్త వికర్ష్ అయ్యే పరిస్థితి టీఆర్ఎస్ లో నెలకొంది.

తాజా వార్తలు