రాయలసీమలో కేసీఆర్‌ భారీ బహిరంగ సభ.. ఎక్కడంటే!

ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి దేశంలో సంచలనం సృష్టించిన కేసీఆర్ ఇప్పుడు.పార్టీ విస్తరణపై ద‌‌ృష్టి సారించారు.

దీని భాగంగా వివిధ రాష్ట్రాల్లో బహిరంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.మెుదటి సభను తెలుగు రాష్ట్రమైన ఏపీలో పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి బీఆర్ఎస్ యాత్రను ప్రారంభించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్న బీఆర్‌ఎస్ అధికారులు అధికారికంగా ప్రకటించనప్పటికీ, తన జాతీయ రాజకీయాల ఆశయానికి ఆంధ్రుల ఆశీస్సులు పొందేందుకు కేసీఆర్ త్వరలో అనంతపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 బీఆర్‌ఎస్‌ తొలి అడుగు కోసం కేసీఆర్‌ అనంతపురంను ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉంది.ఎన్టీ రామారావు టీడీపీలో కేసీఆర్ తన రాజకీయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

 ఒకప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ఇప్పటికీ స్థానిక నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహించనున్న తన అనంతపురం సభకు కనీసం లక్ష మందిని సమీకరించాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఏపీలో జరిగే ఈ మెగా బహిరంగ సభతో కేసీఆర్ ముందుగా తెలుగు ప్రజలందరి మనసు దోచుకోవాలని, ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆ తర్వాత ఉత్తర భారత రాష్ట్రాలైన యూపీలో వరుస సభలు నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.బీహార్, న్యూఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర. మోడీని ఓడించి, బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ కోసం బీఆర్ఎస్ థింక్ ట్యాంక్ ప్రస్తుతం మెగా టూర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది.2024 సార్వత్రిక ఎన్నికల్లో 200 ఏ పైగా ఏంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ పడనున్నట్లు తెలుస్తుంది.ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఇప్పటి నుండే కసరత్తు నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు