కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టే..: మాజీ మంత్రి జూపల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన ఆయన దాని వలన ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు.

ఎవరెవరు ఎలాంటి వారో తెలంగాణ మొత్తం చూసిందని జూపల్లి విమర్శించారు.కేసీఆర్ కు మైనంపల్లి దెబ్బ రుచి చూపించాలన్నారు.

పట్నం మహేందర్ రెడ్డి పౌరుషం చూపించాలన్న జూపల్లి గజ్వేల్, కామారెడ్డిలో పోటీతో కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు.గత మేనిఫెస్టోను కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు.

ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కొల్లాపూర్ నుంచి పోటీకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు.

Advertisement

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవసరమేనన్న జూపల్లి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడును కాంగ్రెస్ పూర్తి చేసిందని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు