ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ఫెడరల్ ప్లాన్ చేసిన కేసీఆర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయాల్లో ఉన్న చాణక్యత చాలా ఎక్కువ.ఎటువంటి సందర్భంలో ఎలా మెదులుకోవాలో ఆయనకు బాగా తెలుసు.

ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా ఆయన అంచనా వేయగలరు.2018 ఎన్నికల సమయంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు.కానీ అది ఎందుకో అప్పుడు పెద్దగా వర్కౌట్ కాలేదు.

దాంతో ఈ సారైనా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.అందుకోసం వివిధ పార్టీలతో ఆయన సమావేశం అవుతున్నారు.

Kcr Has A Federal Plan To Unite The Regional Parties , Kcr, Trs,tejaswi, Sitaram

కేసీఆర్ ఈ మధ్య లాలూ తనయుడు తేజస్వి, సీతారాం ఏచూరి, స్టాలిన్, విజయన్ తదితర నాయకులతో చర్చలు జరిపారు.కాగా ఈ సారి ఎలాగైనా సరే ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది .కానీ ఆయన ఫెడరల్ ఫ్రంట్ మీద కూడా అనేక అనుమానాలున్నాయి పలువురికి.ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంది బీజేపీ కోసమేనని కొందరు చెబుతున్నారు.

కాంగ్రెస్ కు సన్నిహితంగా ఉండే పార్టీలను ఒక్కటి చేసి కాంగ్రెస్ కు వ్యతిరేఖం చేయాలని ఆయన చూస్తున్నారని దీని వల్ల తుది ఫలితం బీజేపీకే వస్తుందని అంటున్నారు.ఇప్పటికే అనేక మంది నేతలతో భేటీ అయిన కేసీఆర్ త్వరలో సీనియర్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement
KCR Has A Federal Plan To Unite The Regional Parties , KCR, Trs,Tejaswi, Sitaram

ఎలాగైనా సరే కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేఖంగా ఒక కూటమిని నెలకొల్పాలని కేసీఆర్ చూస్తున్నాడు.అందుకోసం బాగానే కష్టపడుతున్నాడు.ప్రగతి భవన్ వేదికగా అనేక రకాల ప్లాన్లు వేస్తూ అమలు చేస్తున్నాడు.

మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోరికలు ఈ సారైనా నెరవేరుతాయో? లేదో?  అనేది మాత్రం కాలమే నిర్ణయించనుంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు