ఆ విషయంలో కేసీఆర్ హ్యాపీనా ..? కారణం ఆయనేనా ..?

అన్ని పార్టీల అధినేతలు తెలంగాణ ఎన్నికల టెన్షన్ లో ఉన్నారు.ఎప్పుడు తిన్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియనంతగా బిజీబిజీగా గడిపేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నాడు.

దీనంతటికీ కారణం ఆయన కుమారుడు కేటీఆర్ కారణం.సమర్థుడైన వారసుడిగా కేసీఆర్ కి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తూ రాజకీయంగా కేటీఆర్ తనని తాను నిరూపించుకున్నాడు.

ఒకప్పుడు ఈ పాత్ర కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు చూసుకునే వారు.కానీ ప్రస్తుతం ఆయన ప్రాధాన్యం తప్పించడంతో కేటీఆర్ హావ పార్టీలో బాగా పెరిగింది.

Advertisement

తెలంగాణాలో అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన తర్వాత, కేసీఆర్‌ కొన్ని సభల్లో మాట్లాడినా .ఎక్కువ శాతం కేటీఆరే పార్టీ ప్రచార భారాన్ని మొత్తం తన భుజాలపైనే వేసుకున్నాడు.అన్ని జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ, సమన్వయకర్తల సమావేశాల్లో పాల్గొంటూ, చేరికలను ప్రోత్సహిస్తూ, ఇలా అన్నీతానై వ్యవహరిస్తూ టీఆర్ఎస్ కి మైలేజ్ తీసుకొచ్చే పనిలోపడ్డాడు.

అంతే కాదు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బలహీనమైన అభ్యర్థుల కారణంగా పార్టీకి ఎదురుగాలి వీస్తుండడంతో .వారి ప్రచార బాధ్యతను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు ప్రచారానికి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థులు ఎవరు కోరినా .కాదనకుండా.నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్యట‌న‌ల‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ స‌మావేశాల‌తో కార్యక‌ర్తల్లో జోష్ నింపేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు.గ్రేట‌ర్‌లోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది.

అందుకే సెటిల‌ర్ల వ్యవ‌హారాన్ని కేటీఆర్‌కు అప్పగించిన‌ట్లు తెలుస్తోంది.నిత్యం పార్టీ అభ్యర్థుల‌తో ట‌చ్‌లో ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుసుకుని అక్కడ వాలిపోతూ .పార్టీకి మైలేజ్ఎ తెచ్చే విధంగా కేటీఆర్ కష్టపడుతూ.తండ్రికి కొంత తలనొప్పి తగ్గిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు