కెసిఆర్ మనవడు , సెక్రెటేరియట్ లో హడావిడి

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్ష్ సెక్రటేరియట్ లో కనిపించడం ఇవాల్టి విశేషంగా మారింది.

అప్పుడప్పుడూ కేసీఆర్ పాల్గొనే సభలూ, సమావేశాలలో ఈ బాబు కనిపిస్తూ ఉంటాడు.

అయితే తన తాతగారు , ముఖ్యమంత్రి కెసిఆర్ లేని సమయంలో ఈ కుర్రాడి సెక్రటేరియట్ కి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురించేస్తోంది.తన ఫ్రెండ్స్ తో సహా సెక్రెటేరియట్ కి వచ్చిన హిమన్ష్ సెక్రెటేరియట్ లోని మంత్రులూ -అధికారుల ఛాంబర్ లన్నీ చుట్టేసాడు.

నెమ్మదిగా తన తాత ఛాంబర్ కి చేరుకొని అక్కడ మైకు లో మాట్లాడాడు కూడా.

ఆ పిల్లాడు సెక్రెటేరియట్ లో తిరిగిన కాసేపూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తెగ హైరానా పడ్డారు.

Advertisement

అప్పట్లో ఒకసారి వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక గణేష్ పెండాల్ లోకి పూజలు చేసి ఒక్కడు వెళ్ళాడు అప్పుడు మీడియా తనని గుర్తు పట్టి అడగగా తెలంగాణా జనాల కోసమే తన పూజలు అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన సెక్రటేరియట్ కు రావడం.

అది కూడా స్నేహితులను తీసుకొచ్చి మంత్రుల చాంబర్లు వంటివన్నీ తిరగడంపై విమర్శలొస్తున్నాయి.ఎంత ముఖ్యమంత్రి మనవడైనా సెక్రటేరియట్ లో పిల్ల గ్యాంగ్ ను వెంటేసుకుని వచ్చి సొంత ఇలాకాలా తిరగడం సరికాదని అంటున్నారు.

.

టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా చేయలేక మధ్యలో వదిలేసిన సినిమాలు ఇవే..!
Advertisement