చంద్రబాబు వేసిన ఎర కి చిక్కిన కవిత..!

చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మహాసభకు ప్రజలు తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు.అయితే ఈ సభలో బాబు మాట్లాడుతూ.

పార్టీ మళ్లీ ఈ రాష్ట్రంలో పుంజుకోవాలని, పార్టీ నుండి దూరమైన వారందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఇందులో వ్యూహాత్మకత ఎంతో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేడర్ దాదాపు లేదు అన్ చెప్పాలి.చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నప్పటికీ ఒక అభ్యర్థిని నిలబెడితే ఓట్లు వేసి డిపాజిట్లు దక్కించుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం.

అయితే తెలంగాణలో టిడిపి మళ్లీ పుంజుకుంటుందని చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత మాత్రం చంద్రబాబు వేసిన ఎరకి చిక్కిపోయారు.

Advertisement

చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత కామెంట్లు చేస్తూ చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నారు.ఆ చంద్రుడు కేసీఆర్ అని నొక్కి వక్కాణించారు.

ఇక తెలుగుదేశం పార్టీ కాలం చెల్లిందని తెలంగాణలో వారి రాజకీయాల కథ ముగిసిపోయిందని అన్నారు.చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీకి పునర్జీవం తీసుకొని రావాలని అనుకుంటున్నాడని అయితే వాళ్లు (తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు) తెలంగాణ బాగుని కోరే వాళ్ళు కాదు అని కవిత చెప్పుకొచ్చింది.

వాళ్ళని ఎప్పుడో తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెబుతూనే ఇప్పుడు రాజకీయం చేద్దామని వచ్చినా వారికి అదే ఫలితం దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

మామూలుగానే రాజకీయాలపై స్పష్టతలో కొంచెం వెనుకబడే కవిత ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది అని చెప్పాలి.అసలు ఉనికే లేదని ఆమె అంటున్న తెలుగుదేశం పార్టీ సభ పెడితే అంత మంది జనం ఎందుకు వచ్చారు? అసలు వారు ఇక్కడ సమూలంగా నాశనం చేయబడ్డారు అని నమ్మినప్పుడు తిరిగి ఆ పార్టీకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? చంద్రుడు కేసీఆర్ ఒక్కడే అన్నప్పుడు చుక్కల గురించి మాట్లాడితే చంద్రుడు చిన్నపోయాడు అని అర్థం రాదా? ఏదైనా కవిత మాత్రం కలవరపాడుతో మాట్లాడి అక్కడ టిడిపి మైలేజీ పెంచడం తప్ప బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement