భానుమతి, రామకృష్ణ, గాయత్రి. ఏంటి పేర్లు అనుకుంటున్నారా ? అయితే ఇవి మనుషుల పేర్లు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.
ఇవి కుక్కల పేర్లు ఇలా పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా అంటే దీని వెనక చాలా ఫన్నీ స్టోరీ ఉంది.
ఇలా తన కుక్కలకు పేర్లు పెట్టుకున్న వ్యక్తి టాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాత అయిన కాట్రగడ్డ మురారి. మరి తన కుక్కలకి భానుమతి రామకృష్ణ అంటూ స్టార్ హీరోయిన్ అయినా నటి పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని అనుమానం వచ్చింది కదా ? ఆ విషయంలోకి వస్తున్నాను.ఎవరైనా సరే తమకు ఇష్టం ఉన్న వ్యక్తుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు కానీ కుక్కలకు పెట్టుకునే వారెవరైనా ఉంటారా? ఖచ్చితంగా కాట్రగడ్డ మురారి ఈ పేరు పెట్టడం వెనక ఒక పెద్ద స్టోరీ నే ఉంది.అయితే కాట్రగడ్డ మురారి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పుస్తకం రాయాలి అని అనుకున్నారు.
అందుకోసం భానుమతి గారి దగ్గరికి నిర్మాతల గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అవసరమై వెళ్లాల్సి వచ్చింది.ఎన్నిసార్లు వెళ్లినా కూడా ఆమె సరిగ్గా స్పందించక మళ్లీ రమ్మని పదేపదే తిప్పి పంపించడం చేసింది.
దాంతో భానుమతి పై పీకల దాకా కోపం పెట్టుకున్నాడు కాట్రగడ్డ మురారి.సరిగ్గా అదే సమయంలో ఎవరో తెలిసిన మిత్రుడు మురారికి రాట్ వీలర్ అనే బ్రీడ్ కి సంబంధించిన కుక్కను బహుమతిగా ఇచ్చాడట.
దాంతో కోపంలో భానుమతి గారి పేరు ఆ కుక్కకు పెట్టేశాడు.
ఆ తర్వాత మరొక కుక్కను తెచ్చుకొని దానికి రామకృష్ణ అని వాటి పిల్లలకు గాయత్రి అని పేరు పెట్టాడు మురారి.కానీ వారిద్దరు తనకు ఎంతో ఆరాధ్య దైవం లాంటి వారు అని మురారి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ విషయం భానుమతి గారికి కూడా చెప్పారట దాంతో ఆమె సరదాగా ఒక రోజు రాత్రి ఫోన్ చేసి మా ఆయన ఎలా ఉన్నాడు అని అడిగిందట అర్థం కాక మురారి సైలెంట్ గా ఉంటే అదే నువ్వు పెంచుకుంటున్న కుక్కవా ఎలా ఉంది అని అడిగిందట అలా కోపంగా కుక్కపిల్ల పేరు పెట్టుకున్న ఆవిడ చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం గొప్ప విషయం కదా.ఇక మురారి సైతం కుక్కలను భానుమతి గారు, రామకృష్ణ గారు అని మాత్రమే పిలుస్తాడట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy