Kasthuri Shankar : నయనతార వీఐపీ అయితే అలా పిల్లల్ని కనొచ్చా.. కస్తూరి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కస్తూరి శంకర్( Kasthuri Shankar ) మీటూ గురించి నేను మాట్లాడానని తెలిపారు.

తమిళంలో, మలయాళంలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కస్తూరి పేర్కొన్నారు.ఆ సినిమా నుంచి తప్పుకోవడం అదృష్టమని ఆమె కామెంట్లు చేశారు.

అందరూ ఒకేలా ఉండరని ఆమె తెలిపారు.అన్ని చోట్లా అన్నీ ఉంటాయని కస్తూరి శంకర్ అన్నారు.

క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) అన్ని చోట్లా ఉంటాయని కానీ అందరూ అదే పనిగా ఉండరని ఆమె తెలిపారు.అందరూ అన్ని టైమ్స్ లో చెడ్డవారిగా ఉండరని కస్తూరి పేర్కొన్నారు.మనం జనరలైజ్ చేయకూడదని ఆమె చెప్పుకొచ్చారు.85 సినిమాలలో నేను నటించానని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

ఇప్పుడు కూడా నాకు సినిమా ఆఫర్లు( Movie Offers ) వచ్చాయని కస్తూరి కామెంట్లు చేశారు.చిన్మయి స్ట్రెయిట్ గా పేరుతో సహా చెప్పేశారని ఆమె చెప్పుకొచ్చారు.నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని వాళ్ల పేర్లు నేను చెప్పలేనని ప్రూఫ్స్ అడిగితే ఎలా ప్రూవ్ చేయాలని కస్తూరి అన్నారు.

నయనతార( Nayantara ) విషయంలో నాకు తోచింది నేను చెప్పానని ఆమె తెలిపారు.నయనతార సరోగసికి( Surrogacy ) సంబంధించి ఏదో తేడా ఉందని కస్తూరి శంకర్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

కొన్ని విషయాలు వీఐపీలకు సాధ్యపడతాయి కానీ సామాన్య ప్రజలకు అస్సలు సాధ్యం కావని కస్తూరి శంకర్ పేర్కొన్నారు.ఇండియాలో దత్తతకు రూల్స్ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.లీగల్ గా కాకుండా జరిగితే మనం ఫైట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని కస్తూరి శంకర్ వెల్లడించడం గమనార్హం.

కస్తూరి శంకర్ నయనతార గురించి పదేపదే కామెంట్లు చేయడంతో ఆ కామెంట్లు( Viral Comments ) నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు