మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇటీవల మహేష్ బాబు మంచి విడుదలైన లేటెస్ట్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు చూస్తే ఆ విషయం బాగా అర్థమవుతుంది.

ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు పలు మల్టీ స్టారర్ సినిమాలు ఇది వరకే చేసిన సంగతి తెలిసిందే.

అలా మహేష్ తో సినిమాపై కోలీవుడ్ యువ హీరో కార్తీ( Hero Karthi ) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.తాను మహేష్ బాబు చిన్నపుడు ఒకే క్లాస్ లో చదువుకున్నామని మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని మంచి కథ కుదరాలి అంటూ కార్తీ తెలిపాడు.దీనితో ఈ ఇద్దరి కలయికలో సినిమా సహా వారి చిన్నపుడు విషయాలు కూడా తెలిశాయని చెప్పాలి.

Advertisement

ఇకపోతే కార్తీ విషయానికి వస్తే ఇక లేటెస్ట్ గా కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా( Satyam Sundaram ) తమిళ్ సహా తెలుగులో హిట్ కాగా తెలుగులో జరిగిన లేటెస్ట్ ప్రెస్ మీట్ లో కార్తీ ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం తమిళంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.తెలుగులో కూడా ఈ సినిమా హిట్టు టాక్ ను సొంతం చేసుకుంది.ఇక మహేష్ బాబు సినిమాకు వస్తే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

రాజమౌళి కూడా ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.మరి కార్తీక్ కోరికను హీరో మహేష్ బాబు నెరవేరుస్తారో లేదో చూడాలి మరి.అలాగే వీరిద్దరితో కలిపి సినిమా చేయబోయే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి మరి.

యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం
Advertisement

తాజా వార్తలు