ఎన్నారైలు జర జాగ్రత్త... అమెరికాలో తొలికేసు నమోదు..!!!

కరోనా పేరు వింటేనే అందరికి ఒళ్ళు ఒక్క సారిగా జలజరిస్తోంది.ఏ రూపంలో మనిషికి సోకుతుందో అంటూ తెగ కంగారు పడిపోతున్నారు.

చైనా లో బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తోందని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న ఈ జబ్బు అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చింది.

అమెరికాలో తొలి కేసు నమోదు కావడంతో అమెరికన్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.సియాటెల్ లో నివసించే ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్టుగా గుర్తించారు వైద్యులు.

మొదటి అతడు ఆరోగ్యం బాగోలేదనే కారణంతో ఆసుపత్రికి వచ్చాడని, కొన్ని వైద్య పరీక్షల అనంతరం సార్స్ ఆనవాళ్ళు గుర్తించిన వైద్యులు వెంటనే ప్రభుత్వాని అలెర్ట్ చేశారు.ప్రస్తుతానికి అతడిని ప్రత్యేకమైన వార్డులో ఉంచి పరీక్షలు చేస్తునారని, పూర్తిగా తగ్గిన తరువాత మాత్రమే అతడిని ఇంటికి పంపుతామని తెలిపారు.

Karolina Virus Recorded In America Siatel
Advertisement
Karolina Virus Recorded In America Siatel-ఎన్నారైలు జర �

అమెరికాలో మొట్టమొదటి సారిగా ఈ కేసు నమోదు కావడంతో మరింతగా వ్యాప్తి చెందకుండా ముందుస్తు చర్యలు ప్రారంభించారు అధికారులు.ఇదిలాఉంటే అమెరికాలో ఈ వ్యాధి కేసు నమోదు అయ్యిందని తెలియడంతో తెలుగు ప్రాంతాలలో నుంచీ అమెరికా వెళ్ళిన ఎన్నారైల తల్లి తండ్రులు కంగారు పడుతున్నారు.అమెరికాలో ఉన్న పలు తెలుగు సంస్థలు ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుగు వారికి ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు