కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లేకపోతే అందరూ సున్నాలేనని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తనకు తల్లిలాంటిదని తెలిపారు.ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని తానేనంటూ డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

తాను వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయనని తెలిపారు.తాను బాధ్యత గల వ్యక్తినన్న శివకుమార్ పార్టీని ఎప్పటికీ విభజించనని స్పష్టం చేశారు.

పార్టీ కోసం చాలా త్యాగాలు చేసినట్లు చెప్పారు.అదేవిధంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చినట్లు వెల్లడించారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు