ఆ తొమ్మిది మందిపై కేసులు పెట్టిన కరాటే కళ్యాణి.. నా ఫోటోలతో అలా చేశారంటూ?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కరాటే కళ్యాణి( Karate Kalyani ) పేరు తెగ వినిపిస్తోంది.

వరుస వివాదాలలో చిక్కుకున్న కరాటే కళ్యాణి ఇప్పుడిప్పుడే ఆ వివాదాల నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గురించి కరాటే కళ్యాణి నెగిటివ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.మరి కొందరు కరాటే కళ్యాణి మార్ఫింగ్ ఫోటోలను( Morphing Photos ) సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది.

అయితే ఈ విషయాలు తన దృష్టికి రావడంతో కరాటే కళ్యాణి తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.నా ఫోటోలు మార్ఫ్ చేసి వైరల్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పేర్లతో సహా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

షీ టీంను కలిసి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో ఫీలవుతున్నానని కరాటే కళ్యాణి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.తొమ్మిది మంది నా పరువుకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.తాను కెరీర్ పరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని కరాటే కళ్యాణి వెల్లడించారు.

కరాటే కళ్యాణి గతంలో కూడా పోలీసులను సంప్రదించి పలువురిపై ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.కరాటే కళ్యాణికి మూవీ ఆఫర్లు సైతం ఎక్కువగా రావడం లేదని సమాచారం అందుతోంది.కరాటే కళ్యాణికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కళ్యాణి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.కరాటే కళ్యాణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు