రష్మిక పాత్ర చూసి డియర్ కామ్రేడ్ కి కనెక్ట్ అయిన కరణ్ జోహార్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్ము దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా థియేటర్ లోకి వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకొని విజయ్ దేవరకొండ కెరియర్ లో మరో ఫ్లాప్ సినిమాగా చేరింది.

అయితే విజయ్ క్రేజ్ కారణంగా తెలుగులో సినిమాని కొన్న బయ్యర్లు కొంత సేఫ్ అయ్యారని తెలుస్తుంది.నిర్మాతలు కూడా సినిమాతో భారీ లాభాలు రాబట్టుకోలేకపోయిన నష్టం అయితే రాలేదని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే డియర్ కామ్రేడ్ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాను అని బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించడం సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా చూసిన అందరూ కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడానికి అసలు ఇందులో అంత గొప్పగా చెప్పుకునే పాయింట్ ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడం వెనుక కరణ్ జోహార్ కి ఇందులో రష్మిక పోషించిన లేడీ క్రికెటర్ పాత్ర భాగా కనెక్ట్ కావడమే అని సమాచారం.ఓ మహిళ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపులు అనే పాయింట్ కరణ్ కి భాగా నచ్చడంతో దానిని బాలీవుడ్ కి తగ్గట్లు కథ, కథనాలు మార్చేసి లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

Advertisement

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కరణ్ అఫీషియల్ లో సినిమా రీమేక్ ని ఎనౌన్స్ చేసి స్టార్ట్ చేసేంత వరకు వేచి చూడాలి.

పురుషుల్లో జుట్టు రాలడాన్ని అడ్డుకునే ఉత్తమ చిట్కా ఇది.. డోంట్ మిస్..!
Advertisement

తాజా వార్తలు