నరసాపురంలో కాపు నేతల అరెస్టులు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కాపు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీనియర్ నాయకుడు హరి రామజోగయ్యను కలిసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందన్న పోలీసులు కాపు నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.మరోవైపు హరి రామజోగయ్యను పరామర్శిస్తామని కాపునాడు నేతలు తేల్చి చెప్పారు.

దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అయితే కాపు రిజర్వేషన్లు కావాలంటూ హరి రామజోగయ్య నిరాహరీ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన నీరసించడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు