Kapil Dev : నాటి నుంచి నేటి వరకు అవమానాలను ఫేస్ చేస్తూ ఎదిగిన కపిల్ దేవ్..!

 భారతీయులకు క్రికెట్ ‌వరల్డ్ కప్‌ను( Cricket World Cup for Indians ) మొట్టమొదటిగా సాధించి పెట్టిన వీరుడు కపిల్‌ దేవ్( Kapil Dev ).

ఈ మాజీ స్టార్ క్రికెటర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ ఆల్ రౌండర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు.బౌలర్లను వణికించే ఫాస్ట్-మీడియం బౌలర్‌గా, విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, తొలి వరల్డ్ కప్ ఇండియాకు సాధించి పెట్టిన అగ్ర ఆటగాడిగా కపిల్ దేవ్ ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఉంటాడు.

ప్రతి భారతీయ ఆటగాడికి ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాడు.ఇండియన్ క్రికెట్‌కు ఎంతో కంట్రిబ్యూట్ చేసినా కపిల్‌ దేవ్‌ను వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు పిలవకపోవడం బాధాకరం.

అయితే రాజకీయ కారణాల వల్లే అతన్ని ఇన్వైట్ చేయలేదని వింత వాదనలను కొందరు వినిపిస్తున్నారు.నిజానికి కపిల్‌ దేవ్‌ను మొన్న వరల్డ్ కప్ కి పిలవకుండా ఎలా అవమానించారో గతంలో అంతకుమించి అవమానించారు.

Advertisement

కెరీర్ ప్రారంభం నుంచి కపిల్ ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నాడు.ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అతను ఎన్ని అవమానాలను చవి చూశాడో తెలుస్తుంది.

అర్బన్‌, ఎడ్యుకేటెడ్ రిచ్‌ కిడ్స్, ముంబైకర్‌ల ఆధిపత్యం, గవాస్కర్‌ కుతంత్రాల మధ్య కపిల్ దేవ్ ఎంతో నలిగిపోయాడు.చండీగఢ్ రాష్ట్రంలోని( Chandigarh State ) మారుమూల గ్రామం నుంచి వచ్చిన కపిల్ ఆటలోని సవాళ్లే కాకుండా ఆట వెలుపల సవాళ్లు కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాడు.

అసాధారణమైన ప్రతిభతో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.ఈ హర్యానా హరికేన్‌ ఎన్ని రికార్డులు సాధించాడు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

అతని వికీపీడియా పేజీ చూస్తే కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ల కంటే ఎక్కువ ఘనతలు సాధించాడనే విషయం తెలుస్తుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఇండియన్ క్రికెట్ కోసం ఇంత కష్టపడినా అతడిని రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసారు.రిటైర్ అయ్యాక కపిల్ టీమిండియాకు కోచ్‌గా ఎంపిక అయ్యాడు కానీ ఆ పదవిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగ లేకపోయాడు.కపిల్‌ పై మనోజ్‌ ప్రభాకర్‌( Manoj Prabhakar ) బెట్టింగ్‌/మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అలిగేషన్స్ చేశాడు.

Advertisement

అందులో నిజం ఉందని ఎవరూ తేల్చలేదు.కానీ కపిల్ పదవి వదిలేశాడు.

కావాలని అతడి పై ఒత్తిడి చేసి కోచ్ పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆ పదవి నుంచి తప్పుకున్న కొన్నేళ్ళకు కపిల్‌ ‘లారేస్ వరల్డ్ స్పోర్ట్ అకాడమీ’( Laures World Sports Academy ) తో మళ్ళీ క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చాడు.నేషనల్ క్రికెట్ అకాడమీకి ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించాడు.కానీ దాని నుంచి కూడా రెండేళ్లలోనే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కపిల్‌ జీ టీవీ ఆధ్వర్యంలో "ఇండియన్ క్రికెట్ లీగ్" అనౌన్స్ చేయగా దానిని రద్దు చేసేంతవరకు బీసీసీఐ నిద్రపోలేదు.తర్వాత కపిల్ తీసుకొచ్చిన అదే కాన్సెప్టును ఒక అక్షరం మార్చి ఇండియన్ ప్రీమియర్ లీగ్ గా బీసీసీఐ అందుబాటులోకి తెచ్చింది.

ఆ విధంగా కపిల్ దేవ్‌కు దక్కాల్సిన క్రెడిట్ బీసీసీఐ సిగ్గులేకుండా దొంగలించింది.వీటన్నిటికీ రాజకీయ పార్టీలు కారణం కాదు, క్రికెట్ లో ఉన్న కొందరి వివక్షతే కారణమని చెప్పవచ్చు.

తాజా వార్తలు