చాలా రోజుల నుండి కూడా మన తెలుగు తో పోలిస్తే తమిళ్ మలయాళం లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తుంటాయి.
ముఖ్యంగా కన్నడ పరిశ్రమ పరిధి అయితే చాలా తక్కువ.
అలాంటి కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలను అందిస్తూ, టాలెంటెడ్ యాక్టర్లను, సాంకేతిక నిపుణులను సైతం అందిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, కన్నడలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే( Hostel Hudugaru Bekagiddare )’.ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది.కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి.
వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది.అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు.
జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు.
క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి ( Nithin Krishnamurthy )డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty)లు అతిథి పాత్రలలో నటించారు.
కాంతార మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది.అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు.అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు.
కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు.ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు.
కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు.
ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ.దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా సరదగా అలా గడిచిపోతుంది.
అందుకే ఈ సినిమా ను తీసిన డైరెక్టర్ కూడా సినిమాని అలాగే నడిపించాడు.అయితే ఈ సినిమా కూడా మన తెలుగు లో వచ్చిన యూత్ ఫుల్ సినిమాల మాదిరిగానే ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy