ఆ సెన్షేషనల్ మూవీ ఇక్కడ మరీ ఇంత సైలెంట్ గా ఉందేంటి?

ఈ మధ్య కాలం లో కన్నడ సినిమా లు తెగ సందడి చేస్తున్నాయి.

కేజీఎఫ్‌, కాంతార సినిమా ల తర్వాత హాస్టల్ హుడుగారు బేకగిద్దారే సినిమా ఓ రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

నాలుగు, అయిదు కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన సదరు సినిమా వందల కోట్ల వసూళ్లు సాధించి చాలా మందిని సర్ ప్రైజ్ చేసింది.కన్నడం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా స్పీడ్ గా బాయ్స్ హాస్టల్( Boys hostel ) అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.

ప్రత్యేకంగా జబర్దస్త్‌ యాంకర్ రష్మితో( Rashmi ) కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం తో పాటు తరుణ్‌ భాస్కర్( Tharun Bhascker ) తో కూడా షూట్‌ చేయడం ద్వారా ఆసక్తి రేకెత్తించారు.డబ్బింగ్‌ చాలా స్పీడ్ గా జరిగినా కూడా క్వాలిటీ పరంగా అద్భుతంగా వచ్చిందనే టాక్ వచ్చింది.దాంతో బాయ్స్ హాస్టల్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు కన్నడ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ కన్నడం లో సెన్షేషనల్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం నిరాశ పరిచింది.మినిమం సక్సెస్ అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా కనీసం రెండు కోట్ల వసూళ్లు సాధించలేదు.పది కోట్ల అంచనా వేసుకున్న డబ్బింగ్‌ నిర్మాతలకు షాక్ అన్నట్లుగా ఫలితం ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

దేశ వ్యాప్తంగా సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.కానీ ఇలాంటి కలెక్షన్స్ తెలుగు లో నమోదు అవుతాయి అని తాము భావించలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

కన్నడ సినిమా లు అన్నీ తెలుగు లో సక్సెస్‌ అవ్వవు అని ఈ సినిమా తో నిరూపితం అయింది.

Advertisement

తాజా వార్తలు