డ్రగ్స్ తీసుకున్నారంటూ రిపోర్ట్.. మళ్ళీ కన్నడ హీరోయిన్లకు షాక్!

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్ కేసులో భాగంగా హీరోయిన్ సంజన, రాగిణిల పై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఎఫ్ఎస్ఎల్ మొదట్లో వీరి రక్త,యూరిన్ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా అందులో పరీక్ష ఫలితాలు సరిగా వెలువడని నేపథ్యంలో మరోసారి ఈ నటీమణుల నుంచి వారి వెంట్రుకలు తీసుకొని 2020 అక్టోబర్ లో వాటిని పరీక్షల కోసం హైదరాబాద్‌ నగరంలోని ఎఫ్ఎస్ఎల్ కు పంపారు బెంగళూరు పోలీసులు.

తాజాగా పరీక్ష ఫలితాలు రావడంతో ఇద్దరు నటీమణులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ జరిగింది.ఈ విధంగా ఈ హీరోయిన్లు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో తిరిగి ఇద్దరు హీరోయిన్లు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

Kananda Heroines Reported To Taken Drugs, Drugs Case, Kananda Heroines, Ragini D

ఈ క్రమంలోనే పోలీసులు వీరిని అరెస్టు చేయడం కోసం బెంగుళూరు పోలీసులు వీరికి సమన్లు జారీ చేయనున్నారు.ఈ క్రమంలోనే వీరికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధం ఏమిటి? వీరికి డ్రగ్ సరఫరా ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్ మాఫియా కేసు బయటపడటంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే కన్నడ హీరోయిన్స్ రాగిణి, సంజన లపై డ్రగ్ మాఫియా ఆరోపణలు రావడంతో పోలీసులు నిర్ధారణ కోసం వీరికి పరీక్షలు నిర్వహించిగా పరీక్ష ఫలితాలలోడ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ విషయం కాస్త కన్నడ పరిశ్రమలో సంచలనంగా మారింది.

Advertisement
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

తాజా వార్తలు