టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు.టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో వారందరికీ చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

అంతకముందు కన్నావారితోటలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీగా తరలివచ్చారు.ఈ నేపథ్యంలో గుంటూరులో భారీగా చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల నుంచి కన్నా అనుచరులు భారీగా తరలివచ్చారు.కాగా కన్నా ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు