పవన్‌ రాక మాకు సంతోషం

ఇటీవల బీజేపీ జాతీయ నాయకత్వంతో భేటీ అయిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజాగా రాష్ట్ర బీజేపీ నాయకులతో కూడా చర్చలు జరిపారు.

ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు నడిచేందుకు సిద్దం అయినట్లుగా పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ప్రకటించాడు.అయితే పవన్‌ కళ్యాణ్‌ను రాష్ట్ర నాయకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Kanna Lakshmi Narayana Pawan Kalyan Janasena-పవన్‌ రాక మా�

కాని బీజేపీ వారు జనసేనానికి ఘన స్వాగతం పలికారు.ఏపీలో బీజేపీతో కలిసి నడిచేందుకు జనసేన ఒప్పుకోవడం చాలా సంతోషకర విషయం అన్నాడు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి షరతులు లేకుండా మాతో నడిచేందుకు ముందుకు రావడం సంతోషం.ఆయనతో ముందు ముందు ఏపీలో పెద్ద రాజకీయ కూటమిగా ఎదుగుతామని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

ఈ సందర్బంగా జనసేన నాయకులతో జరిగిన చర్చల గురించి కన్నా చెప్పుకొచ్చాడు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు