కోట్లు పెట్టి ఫేస్ డీ-ఏజింగ్ చేశారు.. మనీ వేస్ట్ అయ్యింది కానీ..?

ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో టెక్నాలజీని బాగా వాడేస్తున్నారని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ టెక్నాలజీని సరిగా వాడుకో లేకపోతే మొత్తం సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతినే అవకాశం ఉంది.

టెక్నాలజీ బాగానే అభివృద్ధి చెందింది కానీ మనోళ్లు దాన్ని అతిగా వాడేస్తూ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నారు.ఈ రోజుల్లో ఎక్కువ మంది డీ-ఏజింగ్ అనే ఒక విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు.

యాక్టర్ లేదా యాక్ట్రెస్ అప్పీరియన్స్ ను చాలా యంగ్‌గా కనిపించేలా చేయడానికి ఈ టెక్నిక్ యూజ్‌ అవుతుంది.ఈ సీజీఐ ట్రిక్కు హాలీవుడ్ డైరెక్టర్లు బాగా వాడుతుంటారు.

Kanikaraj About Vikram Movie Deaging , Bollywood, Tollywood , Acharya , Chira

ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్( Bollywood, Tollywood ) హీరోల సినిమాల్లో కూడా ఈ టెక్నిక్ ఉపయోగించడం జరుగుతోంది.ఉదాహరణకు యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ టీనేజ్ ఎపిసోడ్స్‌లో అతను కుర్రాడిలాగా కనిపించడం మనం గమనించవచ్చు.అది విజువల్ ఎఫెక్ట్ ఉపయోగించి చూపించినదే.

Advertisement
Kanikaraj About Vikram Movie Deaging , Bollywood, Tollywood , Acharya , Chira

సందీప్ రెడ్డి వంగా దీనిని బాగానే ఉపయోగించగలిగాడు.కానీ ఆచార్య సినిమా( Acharya )లో చిరంజీవిని యువకుడిలా చూపించడంలో మాత్రం కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు.

చిరంజీవి( Chiranjeevi ) ముఖం ఒక బొమ్మలాగా కనిపించింది.అది చూడటానికి అస్సలు బాగోలేదు.

మూవీ ఫెయిల్ కావడానికి ఇది కూడా ఒక కారణమే అని చెప్పుకోవచ్చు. కల్కి 2898 AD( Kalki 2898 AD )లో అమితాబ్ బచ్చన్ యంగ్ ఫేస్ మాత్రం బాగానే కుదిరింది.

Kanikaraj About Vikram Movie Deaging , Bollywood, Tollywood , Acharya , Chira

ఇంకో సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోని యంగ్ గా చూపించడానికి ఈ ట్రిక్ ఉపయోగించారు.దాన్ని సినిమాలో యాడ్ చేసి మొత్తం ఔట్ పుట్ చూడగా అది చాలా తేడాగా వచ్చిందని అర్థమైంది.ఆ మూవీ మరేదో కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఈ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా నటించాడు.ఇందులో "వన్స్‌ అపాన్ ఏ టైమ్‌ హీ ఇస్ ఏ ఘోస్ట్" అనే ఒక సీక్వెన్స్ వస్తుంది.

Advertisement

అందులో కమల్ హాసన్ యంగ్ లుక్ కోసం డీ-ఏజింగ్ ఫేస్ వాడారు.అయితే ఇదంతా చూసిన తరువాత బాగోలేదని వెంటనే లోకేష్ కనగరాజ్ ఆ సన్నివేశాలను మొత్తం తొలగించి ఓన్లీ ఫోటోలు ఉపయోగించి సినిమా రిలీజ్ చేశాడు.

దీనివల్ల సినిమాపై ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ పడలేదు.కోట్లు వృధా అయ్యాయి కానీ సినిమా మాత్రం నెగిటివిటీని మూట కట్టుకోకుండా సక్సెస్ అయ్యింది.

తాజా వార్తలు