Kangana ranaut : స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పరిస్థితి దారుణం.. ఏ సినిమా ముట్టుకున్నా మసే అవుతోందా?

బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ ( Kangana ranaut )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కంగనా రనౌత్‌.

ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.సినిమాల ద్వారా అలాగే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది కంగనా రనౌత్‌.

అయితే ఎక్కువ శాతం సంబంధించిన విషయాలతోనే హైలైట్ అవుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో గంగాన రనౌత్ సినీ కెరియర్ అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

మణికర్ణిక సినిమా ( Manikarnika )తర్వాత ఆమె ఏ సినిమాలో నటించినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.ఇటీవల విడుదలైన చంద్రముఖి 2 సినిమా ( Chandramukhi 2 )కూడా ఫ్లాప్ గా నిలిచింది.ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజస్ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయింది.

Advertisement

ఈ సినిమాకు స్వరేష్ మేరావ్ దర్శకత్వం వహించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.

కలెక్షన్ల పరంగా కూడా చాలా దారుణంగా ఉంది.దాదాపుగా రూ.60 కోట్ల బడ్జెట్‌ పెట్టి తీస్తే, రూ.6 కోట్లు కూడా వసూలు కాలేదంటే, బాక్సాఫీస్‌ వద్ద తేజస్‌ టాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోమవారం కలెక్షన్స్‌ చూసి, ట్రేడ్‌ వర్గాలే నోరెళ్ల బెడుతున్నాయి.మొత్తంగా చూసుకుంటే రూ.50లక్షలు కూడా రాలేదట.ఒకరకంగా చెప్పాలి అంటే కంగాన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా కూడా చెప్పుకోవచ్చు.

ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.విడుదల అయిన రోజే ఘోరమైన ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది.మొదటి రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్స్‌ రూ.1.25కోట్లు వసూలు చేయగా, సోమవారం వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి మొత్తం వసూళ్లు రూ.4.25 కోట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల బాలీవుడ్‌ విడుదలైన చిత్రాల్లో అతి తక్కువ కలెక్షన్స్‌ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు తేజస్‌ కూడా నిలిచింది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

శని, ఆదివారాల్లో చాలా థియేటర్‌లలో 10-12 మంది మాత్రమే కనిపించారట.సోమవారం పలు థియేటర్‌లు ఏకంగా షోలనే రద్దు చేశాయి.బిహార్‌కు చెందిన సినిమా పంపిణీదారు విషేక్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.

Advertisement

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో జీరో టికెట్‌ సేల్స్‌ కారణంగా షో రద్దైన చిత్రంగా తేజస్‌( Tejas movie ) నిలిచిందని అన్నారు.దీంతో చాలామంది కంగానపై విమర్శలు చేస్తున్నారు.

కంగనా ఏ సినిమా ముట్టుకున్నా కూడా మసే అంటూ కామెంట్ చేస్తున్నారు.ఒకవేళ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే ఆమె సినిమా నన్ను మానేయాల్సిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు