విల్ స్మిత్ ఘటనపై కంగనా ఘాటు వ్యాఖ్యలు.. నేనైతే అలా చేసేదాన్ని అంటూ..

విల్ స్మిత్ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.94వ ఆస్కార్ వేడుకల్లో హోస్ట్ చేసిన క్రిస్ రాక్ ని హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ వేదికపై చెంప పగలగొట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

క్రిస్ రాక్ వేదికపై విల్ స్మిత్ భార్యపై జోకు లేయడంతో విల్ స్మిత్ సీరియస్ అయ్యాడు.

ఈయన కొట్టిన తర్వాత క్రిస్ రాక్ కు క్షమాపణలు కూడా తెలిపాడు.అయితే ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.ఇంత వరకు ఆస్కార్ వేడుకల్లో ఇలాంటి ఘటన చోటు చేసు కోలేదట.

ఇది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులకు మాయని మచ్చగా మిగిలి పోయింది.దీనిపై నెటిజెన్స్ కూడా భిన్న రకాలుగా స్పందిస్తు న్నారు.

క్రిస్ రాక్ అలా మాట్లాడడం తప్పే.అయన మాటలకూ విల్ స్మిత్ అందరి ముందు అలా కొట్టడం కూడా తప్పే అంటూ రక రకాల విశ్లేషణలు చేస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు.విల్ స్మిత్ చెంపపై కొట్టి వదిలేసాడు.

నేనైతే ఇంకా గట్టిగ తన్నేదాన్ని.నవ్వించడానికి ఎవడైనా ఇలా ఈ దారిని ఉపయోగించుకుంటే నేను విల్ స్మిత్ లాగే చేస్తాను.

గట్టిగ బదులిస్తా.ఇలాంటి వాళ్ళను వదిలి పెట్టకూడదు.

ఆయన త్వరలోనే నా లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా అంటూ ఈమె రాసు కొచ్చింది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం కంగనాకు కొత్తేమి కాదు.ఈమె మనసులో ఏది ఉంటె దాన్ని బయటకు అనేస్తుంది.ఇప్పుడు విల్ స్మిత్ ఘటన కేసులో కూడా కంగనా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎప్పటి లాగానే కొంత మంది సపోర్ట్ చేస్తుంటే.మరి కొంత మంది మాత్రం ఈమె ఇలా వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెబుతున్నారు.

తాజా వార్తలు