అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. కమలా హారిస్‌ తరపున జో బైడెన్ ప్రచారం, శ్రేణుల్లో జోష్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్( Kamala Harris ) ఎంపికైన సంగతి తెలిసిందే.

తన రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను( Tim Walz ) సైతం ఎంపిక చేసుకుని ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

అయితే అధ్యక్ష బరిలో తానే ఉంటానని ఎన్నో ఆశలు పెట్టుకున్న బైడెన్.( Biden ) అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు.

కానీ వెళ్తూ వెళ్తూ కమలా హారిస్‌కు తన మద్ధతు తెలిపారు.ఇది ఆయన తనకు తానుగా తీసుకున్న నిర్ణయమో లేక పార్టీ ఆదేశమో తెలియదు కానీ.

కమలా హారిస్ ప్రచార కార్యక్రమాల్లో బైడెన్ ఎక్కడా కనిపించడం లేదు.ఈ వ్యవహారంపై అమెరికన్ మీడియాలో కథనాలు వస్తుండటంతో డెమొక్రాట్లు అప్రమత్తమయ్యారు.

Advertisement

పార్టీ మొత్తం ఏకతాటిపై ఉందని చాటిచెప్పేలా అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ కలిసి ఒకే వేదికపైకొచ్చారు.వాషింగ్టన్ శివార్లలోని మేరీల్యాండ్ కమ్యూనిటీ కాలేజ్( Maryland Community College ) ఇందుకు వేదికగా మారింది.

ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.రిటైర్ అయిన ఉద్యోగులకు వైద్యపరమైన ఖర్చులు తగ్గించేలా కీలక నిర్ణయాలను ప్రకటించారు.మధుమేహం, హృద్రోగ సమస్యలు, రక్తం గడ్డకట్టే సమస్యలకు మరింత చౌకగా ఔషధాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

అధ్యక్షురాలిగా కమలా హారిస్ అద్భుతంగా పనిచేస్తారని జో బైడెన్ ఆకాంక్షించారు.త్వరలో చికాగోలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో( Democratic National Convention ) కమలా హారిస్‌ను పార్టీ అభ్యర్ధిగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు.

ఈ నేపథ్యంలో కమలకు మద్ధతుకు బైడెన్ నిలబడటంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

వైరల్: రైలు పట్టాలపై నిద్ర పోయిన వీర వనిత.. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఆ కారణం వల్ల అవకాశాలు కోల్పోయాను.. రకుల్ సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు.ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లోనూ కమల హారిస్ ముందంజలో ఉన్నారు.న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్‌లు స్వింగ్ స్టేట్స్‌లో సంయుక్తంగా సర్వేని నిర్వహించాయి.

Advertisement

ఇందులో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) కంటే కమల 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొనే విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగన్‌లలో ట్రంప్‌కు 46 శాతం మంది మద్దతు పలకగా.

కమలా హారిస్‌కు 50 శాతం మంది జైకొట్టారు.మరోవైపు.

విరాళాల విషయంలోనూ ట్రంప్‌తో పోలిస్తే కమల ముందంజలో ఉన్నారు.అలాగే వీరిద్దరి మధ్య వచ్చే నెల 10న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది.

తాజా వార్తలు