కాంగ్రెస్ పార్టీలోకి కమల్ పార్టీ..?

మార్పు కోసం అంటూ.మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పార్టీ పెట్టిన కమల్ హాసన్.

అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో ఎదగలేక పోయారు.పార్టీ పెట్టిన దగ్గరి నుంచి ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకుంటూ.

తన ఇజ్జత్ కరాబ్ చేసుకున్నారు.హిందూ టెర్రరిజం.

అంటూ సెటైర్లు వేసి.ప్రజల్లో నెగిటివిటీని మూటగట్టుకున్నారు.

Advertisement

ఇక లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీని రంగంలోకి దింపి డిపాజిట్లు కోల్పోయారు.అయితే సాధారణ ఎన్నికల్లో సత్తా చాటుదామని ప్రయత్నాలు చేసినా.

అవేవి ఫలించలేదు.తాను అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోక పోయే సరికి ఆయన అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ వస్తోంది.అందుకే ఆయన తన పార్టీని మరో పార్టీలో విలీనం చేయాలని చూస్తున్నారు.

తన మనస్థత్వానికి అనుకూలంగా ఉండే పార్టీ కోసం ఇంత కాలం వెతికారట.కరెక్ట్ టైంలో.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

కాంగ్రెస్ జోడో యాత్ర ప్రారంభించడంతో ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేసి.జాతీయ స్థాయిలో పొలిటికల్ గా ఫేమ్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అందుకే ఏకండా హస్తినకి పోయి.రాహుల్ గాంధీ యాత్రలో కదం కలిపారు.

అక్కడితో ఆగకుండా.రాహుల్ తో స్టేజ్ పంచుకుని స్పీచులు ఇచ్చారు.

తన తండ్రి కాంగ్రెస్ వాది అంటూ స్పీచ్ స్టార్ట్ చేయడంతో.ఆయన కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మరి నిజంగా ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే.

జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆయన ఆలోచిస్తున్నారట.మరి నిజంగా ఆయన పార్టీని విలీనం చేసి చక్రం తిప్పుతారా.? లేక పార్టీని వదిలేసి.మెగాస్టార్ చిరంజీవి మాదిరి సినిమాలకు పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి.