భారతీయుడు 2 రివ్యూ: ప్రేక్షకులను విసిగించిన తాతయ్య!

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్( Kamal Haasan ) నటించిన చిత్రం భారతీయుడు( Barateeyudu ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా భారతీయుడు 2( Barateeyudu 2 ) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సమాజంలో జరుగుతున్న అవినీతి లంచగొండి తనం పై ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చార.డైరెక్టర్ శంకర్ మరి భారతీయుడు 2 సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ:

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్)( Siddharth ) తన స్నేహితులతో కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతుంటాడు.సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు.

ఆ వీడియోలు చూసి జనం కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా వీడియోలు చేయడం ద్వారా మారుతారని భావించిన సమాజంలో ఏ విధమైనటువంటి మార్పు రాదు.

Advertisement

ఇలాంటి సమయంలో మళ్లీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే భారతీయుడు రావాలని.కమ్‌బ్యాక్ ఇండియన్ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు చిత్ర.

స్వాతంత్ర సమరయోధుడిగా( Freedom Fighter ) గుర్తింపు పొందిన భారతీయుడు అయితేనే సమాజంలో జరుగుతున్న ఈ అవినీతిని నిర్మూలిస్తారని భావిస్తాడు.అలా వాళ్ల శ్రమ ఫలించి సేనాపతి( Senapathi ) మళ్లీ తిరిగొస్తాడు.వచ్చీ రాగానే అన్యాయం చేస్తున్న వాళ్లు, అవినీతికి పాల్పడుతున్న పెద్ద తిమింగళాలను పట్టుకుని.

తనకు తెలిసిన వర్మ కళను ఉపయోగించుకుని చంపేస్తుంటాడు.సేనాపతి మాటలకు బ్రెయిన్ వాష్ అయిన చిత్ర అండ్ గ్యాంగ్.

ఆ తర్వాత తమకు జరిగిన అన్యాయాలకు తనే కారణమని తెలుసుకొని తనని దేశం వదిలి వెళ్లిపొమ్మని చెబుతారు.అసలు సేనాపతిని దేశం విడిచి వెళ్లిపొమ్మని చెప్పడానికి సరైన కారణం ఏంటి అనేది ఈ సినిమా కథ.

ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 
రష్యన్ యువతి కోరికలు విన్నారా.. ముందుగా అదే కావాలట..

నటీనటుల నటన:

ఈ సినిమాలో కమల్ హాసన్ మరో సరి తన నటన విశ్వరూపం చూపించారు.కమల్ హాసన్ చేసే యాక్షన్ సన్ని వేషాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.ఇక సిద్ధార్థ్ కూడా ఉన్నంతలో బాగానే నటించాడు.

Advertisement

రకుల్( Rakul ) చిన్న పాత్రే.ప్రియా భవానీ శంకర్ , ఎస్ జె సూర్య, సముద్రఖని వంటి వారందరూ వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్:

అనిరుధ్ సంగీతం అంటేనే సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.ఈయన సంగీతం ద్వారానే సినిమాలను బ్లాక్ బస్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయి.కానీ భారతీయుడు విషయంలో మాత్రం ఈయన మ్యాజిక్ ఎక్కడో కాస్త మిస్ అయింది అని తెలుస్తుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.ఎడిటింగ్ ఎక్కడో కాస్త వీక్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక దర్శకుడు శంకర్ మేకింగ్‌లో భారీతనం కనిపించింది.కానీ మార్క్ మిస్ అయింది.

ఎక్కడా ముందు సినిమాలోని ఎమోషన్ కనిపించలేదు.

విశ్లేషణ:

భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు 2 మీద అలాగే ఉంది.28 ఏళ్ళ కింద వచ్చిన భారతీయుడు ఇప్పటికీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయిందంటే అందులో ఉన్న కంటెంట్ కారణం.అయితే ఆ కంటెంట్ సీక్వెల్స్ సినిమాలో మిస్ అయింది అని తెలుస్తుంది.

లంచగొండితనంపై చేసిన భారతీయుడు సినిమా ప్రేక్షకులను ఎంతగానో కనెక్ట్ చేసింది కానీ సీక్వెల్ సినిమాలో ఆ కనెక్షన్ మిస్సయింది.స్క్రీన్ ప్లే కూడా అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తుంది.

క్లైమాక్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా మిగిలిపోయింది.మొత్తానికి భారతీయుడు సినిమా చూసినంత ఆసక్తి ఆ భావన ఈ సినిమా విషయంలో కనిపించలేదని చెప్పాలి.

బాటమ్ లైన్:

ప్రేక్షకులను విసిగించిన తాతయ్య!

రేటింగ్: 2/5

తాజా వార్తలు