దేవర షూట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్న స్టార్ హీరో కాలేక పోయాడు.

కానీ ఈ మధ్య ఇతడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో కెరీర్ మారిపోయింది.

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.కళ్యాణ్ రామ్ బింబిసార నుండి ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

ఇటీవలే అమిగోస్ సినిమా( Amigos )తో వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.ఇక ఇప్పుడు డెవిల్ సినిమాతో( Devil Movie ) ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశారు.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు.మరి తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించాడు.

ఎన్టీఆర్( NTR ) ప్రజెంట్ దేవర సినిమా( Devara ) చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాదే షూట్ స్టార్ట్ చేసుకుంది.కానీ మేకర్స్ ఇంత వరకు ఎంత షూట్ ఫినిష్ చేసారో రివీల్ చేయలేదు.

అయితే తాజాగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా షూట్ ఎంత ఫినిష్ అయ్యిందో చెప్పి పెద్ద గుడ్ న్యూస్ ఇచ్చాడు.ఈ సినిమా కరెక్ట్ గా 80 శాతం షూట్ పూర్తి అయ్యింది అంటూ కన్ఫర్మ్ చేసాడు.

దీంతో ఈ న్యూస్ తారక్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

కాగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ( Samyukta Menon ) నటిస్తుండగా నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు.హర్ష వర్ధన్ రామేశ్వర్ ( Harshavardhan Rameshwar ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు