ఆ విషయంలో ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ పోటీ ఇస్తున్నాడా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో తారక్ ఒకరని అందరూ భావిస్తారు.నటన విషయంలో తారక్ గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

కళ్లతో సైతం తారక్ హావభావాలు పలికిస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే నటన విషయంలో ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమిగోస్ టీజర్ చూసిన నెటిజన్లు ఈ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మూడు పాత్రలలో కళ్యాణ్ రామ్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

మూడు పాత్రలలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బింబిసార సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో అమిగోస్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం గమనార్హం.

Advertisement

సొంత ఇంట్లోనే తారక్ కు కళ్యాణ్ రామ్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కాంబినేషన్ ను సెట్ చేసే డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది.గతంలో ఈ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం అందుతోంది.

కళ్యాణ్ రామ్ తొలి సినిమా నుంచి ఇప్పటివరకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.కళ్యాణ్ రామ్ తన సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేస్తే ఈ నటుడి స్థాయి మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఒక్కో సినిమాకు హీరో కళ్యాణ్ రామ్ 5 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు