మెగా అల్లుడికి కరోనా నెగెటివ్.. కౌగిలించుకున్న కుటుంబం

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, తన తొలి చిత్రం విజేతతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాకపోయినా హీరోగా ఆయనకు మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

ఇక ఈ సినిమా తరువాత తన రెండో సినిమాను ఓకే చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు కళ్యాణ్.అయితే పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణ్ దేవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Kalyaan Dhev Tested Negative For Corona, Kalyaan Dhev, Super Machi, Corona, Mega

‘సూపర్ మచ్చి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తుండగా రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

కాగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొదలు కావడంతో కళ్యాణ్ దేవ్ కూడా తన సినిమాను ప్రారంభించాడు.అయితే ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కాకుండా విడిగా ఓ గదిలో ఉండసాగాడు.

Advertisement

ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కళ్యాణ్ దేవ్‌కు కరోనా పరీక్ష చేశారు.కాగా కరోనా నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.

ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక పులి వాసు డైరెక్ట్ చేస్తున్న సూపర్ మచ్చి సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్స్ తింటే..ఆ జ‌బ్బులు ద‌రిచేర‌వ‌ట‌?
Advertisement

తాజా వార్తలు