కాలాష్టమి రోజు మహాశివునికి ఇలా పూజ చేస్తే నరదృష్టి మన దగ్గరికి కూడా రాదా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూ ఉంటారు.అదేవిధంగా కొంతమంది ఇంట్లో కూడా పూజలు చేస్తుంటారు.

మహా శివుని రూపమైన కాలా భైరవుని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ప్రతినెలా కృష్ణపక్షంలో అష్టమి తేదీన కాలష్టమి పండుగను జరుపుకుంటారు.

ఆ రోజున కాలభైరవుడితో పాటు శివుని కూడా చాలామంది ప్రజలు పూజ చేస్తారు.కాలభైరవుని శివుని ఉగ్రరూపం అని చాలామంది చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా దేశంలోని అనేక ప్రాంతాలలో ఈరోజు దుర్గా దేవిని కూడా పూజించే ఆచారం ఉంది.కానీ ఈసారి కాలాష్టమిని డిసెంబర్ 16 2012 శుక్రవారం జరుపుకునే అవకాశం ఉంది.కాలాష్టమి డిసెంబర్ 16 2022 ఉదయం1.39 నిమిషములకు మొదలై డిసెంబర్ 17 తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషంలో ముగుస్తుంది.ఉదయ తిధి ప్రకారం కాలాష్టమి డిసెంబర్ 16న జరుపుకునే అవకాశం ఉంది.

Advertisement

ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించడం మంచిది.ఆ తర్వాత కాలభైరవునికి పూజ చేయాలి కాలాష్టమి రోజున కాల భైరవునితోపాటు నల్ల కుక్కను పూజించే ఆచారం కూడా మన దేశాలలో కొన్నిచోట్ల ఉంది.

పూజ చేసిన తర్వాత కాలభైరవుని కథ వినిపించడం వల్ల కూడా మేలు జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.ఈరోజు కాలాష్టమి రోజు కాల భైరవ మంత్రం "ఓం కాలభైరవాయ నమః" జపించడం పుణ్యఫలంగా చాలా మంది భక్తులు భావిస్తారు.

ఆ రోజున పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కాలాష్టమి రోజు వీలైతే అబద్ధాలు చెప్పకుండా ఉండడం ఆ కాలభైరవ నీతో పాటు మహా శివునికి కూడా ఎంతో ఇష్టం.ఆరోజు అబద్ధాలు చెప్పడం వల్ల మీరు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎవరికి హాని కలిగించే ఉద్దేశంతో కాలభైరవుడ్ని ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు.కాకుండా ఆ రోజున తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అవమానించకూడదు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

పూజ చేయడం మంచిది గృహస్తులు చేయడం మంచిది కాదు కుక్కలను చంపవద్దు కానీ వీలైనంత ఎక్కువ ఆహారం ఇవ్వడం మంచిది.

Advertisement

తాజా వార్తలు