ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ద్వారా కాకినాడ టు తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసమే..!

కొత్త సంవత్సరంలో తిరుమల దర్శనం( Tirumala Darshan ) కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారా.

అయితే ఐఆర్‌సీటీసీ( IRCTC ) అందిస్తున్న ఈ ప్యాకేజీ గురించి తెలుసుకోండి.

ఈ యాత్ర రెండు రాత్రులు, మూడు పగుళ్లు కొనసాగుతుంది.అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట,తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.

ప్రతి శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే శేషాద్రి ఎక్స్ప్రెస్( Seshadri Express ) ట్రైన్ నెంబర్: 17210 రాత్రి పది గంటల 50 నిమిషములకు విజయవాడ చేరుకుంటుంది.రెండో రోజు ఉదయం 5:10 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు.అక్కడ ముందుగా బుక్ చేసిన హోటల్ కు తీసుకెళ్తారు.

అలాగే అల్పాహారం తర్వాత తిరుమల కు బయలుదేరుతారు.ప్రత్యేక దర్శనం టికెట్లతో స్వామివారిని దర్శించుకోవచ్చు.శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం తర్వాత తిరుచానూరుకు ప్రయాణం అవుతారు.

Advertisement

అక్కడ పద్మావతి అమ్మవారిని( Padmavati Ammavaru ) దర్శించుకుంటారు.ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు.

రెండవ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు రైలులో తిరుగు ప్రయాణం ఉంటుంది.మూడవరోజు ఆయా స్టేషన్లో చేరుకోవడంతో యాత్ర పూర్తి అవుతుంది.

ఇంకా చెప్పాలంటే తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు ఏసీ, స్లీపర్ ఎంపికను బట్టి ప్యాకేజీలో అంతర్భాగం చేసుకోవచ్చు.ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం కూడా ఉంటుంది.

తిరుమల తిరుపతి చెన్నూరు ఆలయాల దర్శన టికెట్లు ప్యాకేజీలో భాగమే.పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రూసుములు ఉంటే భక్తులే చెల్లించాలి.ఒక రోజు అల్పాహారం మాత్రమే ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది.

Hair Growth Treatment : ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

అలాగే టూర్‌ గైడ్,( Tour Guide ) ప్రయాణ భీమా( Travel Insurance ) సదుపాయం ఉంటుంది.తిరుమల లో శ్రీవారిని దర్శించుకుంటే తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.

Advertisement

ఇంకా చెప్పాలంటే స్టాండర్డ్‌ లో రూమ్ సింగల్ షేరింగ్ అయితే 4,690 రూపాయలు.ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్ కు 4,720 రూపాయలు.

అలాగే అయిదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్,విత్ ఔట్ బెడ్ 3,810 చెల్లించాలి.కంఫర్ట్ లో సింగల్ షేరింగ్ కు 4,690 రూపాయలు.

ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్ కు 3,560 రూపాయలు చెల్లించాలి.ఐదు సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్, విత్ ఔట్ బెడ్ 2650 రూపాయలు చెల్లించాలి.

ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్ క్యాన్సిలైజేషన్ క్రింద 250 మినహాయించి మిగతా మొత్తాన్ని మి ఖాతాకు రిఫుండ్ చేస్తారు.అలాగే ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే తిరిగి చెల్లింపులు ఉండవు.

తాజా వార్తలు