ఐరన్ లెగ్ కామెంట్ల గురించి అలా రియాక్ట్ అయిన కాజల్ అగర్వాల్.. రైట్ కాదంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి మన అందరికీ తెలిసిందే.కాజల్ పెళ్లి అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు.

అదే ఊపుతో అదే క్రేజ్ తో సినిమాలలో వరుసగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.పెళ్లి అయినప్పటికీ విషయంలో అందం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు.

ఆ సంగతి పక్కన పెడితే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సత్యభామ( Satya Bhama ).సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7 విడుదల కానుంది.ఈ సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే కాజల్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉంది.ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Advertisement

తెలుగు మాట్లాడగలిగే నటులకే ఇక్కడి ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.అప్పట్లో ఇలా ఉండేది కాదు కదా అని ప్రస్తావించగా కాజల్‌ స్పందించారు.

తన విషయంలో అలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు.

నటనకు భాష అవసరంలేదని, అయినా నేర్చుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, ఇంకా చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.

హీరోయిన్ల విషయంలో ఐరన్‌లెగ్‌( Ironleg ) అనే కామెంట్స్‌ రావడంపై మాట్లాడుతూ.ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి.హీరోయిన్‌ సినిమాలో ఓ భాగం మాత్రమే.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఏ చిత్రమైనా ఫ్లాప్‌ అయితే హీరోయిన్‌పైనే నెగెటివ్‌గా మాట్లాడడం సరికాదు అని అన్నారు.అవకాశం వస్తే నయనతార, అనుష్క శెట్టిలతో కలిసి నటించాలనుంది ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.

Advertisement

తాజా వార్తలు