జూనియర్ ఎన్టీయార్ వార్ 2 లో సెకండ్ హీరో గా చేస్తున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) సినిమా రాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత వార్ 2( War 2 ) సినిమాతో ఆయన బాలీవుద్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇంతకుముందు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ గురించి మనకు తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ ని ఆది పురుష్ సినిమా పేరుతో భారీగా దెబ్బ కొట్టారు.

ఇక ఎన్టీఆర్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురవ్వబోతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు జూనియర్ ఎన్టీఆర్ ని హెచ్చరిస్తున్నారు.అయినప్పటికీ ఆయన మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా తన షూటింగ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి పట్టించుకోవడం లేదు.హృతిక్ రోషన్( Hrithik Roshan ) హీరోగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఏమాత్రం క్రేజీ దక్కుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.ఇక త్రిబుల్ ఆర్( RRR ) సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ కు ఇలాంటి అన్యాయమే జరిగింది.మరి ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అవుతుందా లేదంటే తనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు