యాక్సిడెంట్ తర్వాత నేను బ్రతికాను అంటే దానికోసమే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడింది.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి ఉండడంతో గత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే 2009వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలకు ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రమాదం గురించి గతంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కారు ప్రమాదంలో ( Car Accident )ఎన్టీఆర్ తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు.అయితే ఆందోళనకరంగా ఏమి జరగకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Jr Ntr Shocking Comments On His Accident At That Time, Jr Ntr,shocking Comments

బలమైన గాయాలు అయినప్పటికీ తారక్ కోలుకుని తిరిగి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.

Jr Ntr Shocking Comments On His Accident At That Time, Jr Ntr,shocking Comments

ఈ ప్రమాదం తర్వాత ఎన్టీఆర్ తన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చుకున్నారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన మైండ్ లి వచ్చినటువంటి ఫస్ట్ థాట్ మనం బతికినన్ని రోజులు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలి.చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.

నాకు జరిగిన యాక్సిడెంట్ లో చనిపోతానని నేను అనుకోలేదు.నాలో ఏదో తెలియని బలమైన కాన్ఫిడెన్స్ ఉండింది.

ఇంత త్వరగా చనిపోననే నమ్మకం కావచ్చు లేదా నేను ఇంకా ఏదో సాధించాలనే కాన్ఫిడెన్స్ కావచ్చు నన్ను ఈ ప్రమాదం నుంచి బయటపడేసిందని తెలిపారు.

Jr Ntr Shocking Comments On His Accident At That Time, Jr Ntr,shocking Comments
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఏదో ఒక నమ్మకం వల్ల బతికాను.మరీ వరస్ట్ గా కాకుండా 6 నెలల్లో కోలుకున్నాను.ఆ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచనలో మాత్రం మార్పు వచ్చింది.నేను చూడాల్సింది చాలా ఉంది.

Advertisement

సాధించాల్సింది చాలా ఉంది.అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చేయాల్సిన పనులన్నింటినీ తొందరగా చేయాలని ఫిక్స్ అయ్యాను.

మరణం అనేది మన చేతుల్లో లేదు ఎప్పుడు వచ్చినా స్వీకరించాల్సిందే అంటూ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ చూసిన అభిమానులు ఎన్టీఆర్ మరి ఇంత మొండోడిలా ఉన్నాడేంటి అంటూ కామెంట్లో చేస్తున్నారు.

తాజా వార్తలు