ఆఫ్ సెంచరీకి చేరువలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఎన్టీఆర్.

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కూడా అతి కష్టం మీద హీరోగా నిలబడి మూడో సినిమాకే స్టార్ హీరో ఇమేజ్ ని తారక్ సొంతం చేసుకున్నాడు.

తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ లో ఒకడిగా మారిపోయారు.గత కొన్నేళ్ళుగా అపజయం అంటూ లేకుండా వరుస విజయాలతో తారక్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నాడు.

అరవింద సమేత బ్లాక్ బస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని ఆర్ఆర్ఆర్ మూవీ స్టార్ట్ చేశాడు.ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా తారక్ మారిపోతున్నాడు.

ఇక ఆర్ఆర్ఆర్ కోసం 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

Jr Ntr Remuneration Per Movie, Rrr Movie, Ram Charan, Nandamuri Family, Tollywoo
Advertisement
Jr Ntr Remuneration Per Movie, RRR Movie, Ram Charan, Nandamuri Family, Tollywoo

ఇదిలా ఉంటే నెక్స్ట్ కొరటాల శివతో తారక్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి కూడా 30 కోట్లు రెమ్యునరేషన్ తో పాటు బిజినెస్ లో వాటాలు కూడా ఇస్తున్నారని తెలుస్తుంది.ఇక ప్రశాంత్ నీల్ చిత్రం కోసం మైత్రీ నిర్మాతలు ఏకంగా 40 కోట్లు రెమ్యునరేషన్ తారక్ కి ఇస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అంటే ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు.ఇప్పుడు వారి స్థాయిలోకి తారక్ వచ్చేస్తున్నట్లు టాక్.ప్రశాంత్ నీల్ చిత్రం తర్వాత చేయబోయే ఏ సినిమాకి అయినా 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఏది ఏమైనా టాలీవుడ్ లో తారక్ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా నందమూరి అభిమానులు గర్వం గా చెప్పుకుంటారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు