బిగ్ బాస్ 3 పై సరికొత్త అప్డేట్ నిజమేనా.? ఆ హోస్ట్ కి రూ. 20 కోట్లు, ప్రైజ్ మనీ రూ. 1 కోటి?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 గురించి ఇప్పటికే రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పెద్ద ఎత్తున సీజన్‌ 3 గురించి వార్తలు ఏదో ఒక రకంగా వస్తున్నాయి.

చిరంజీవి, వెంకటేష్‌లలో ఒకరు బిగ్‌బాస్‌కు హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆ వార్తలపై ఇటీవలే వెంకటేష్‌ స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదన్నాడు.

ఇక చిరంజీవి ప్రస్తుతం అలాంటి ఆలోచన లేకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అదేంటి అంటే.జూనియర్ ఎన్‌టీఆర్‌నే హోస్ట్‌గా పెట్టాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందట.3వ సీజన్‌ను గత రెండు సీజన్‌ల కంటే ఎక్కువ కాలం నిర్వహించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

గత రెండు సీజన్లకు ప్రైజ్ మనీ 50 లక్షలు కాగా మూడవ సీజన్‌లో దాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు వినికిడి.అంతేకాకుండా హోస్ట్‌గా జూనియర్ ఎన్‌టీఆర్ వస్తే అతనికి 20 కోట్లు అయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అయితే తారక్ రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎన్ఠీఆర్ ను శనివారం నాలుగు గంటలు, ఆదివారం నాలుగు గంటలు షోలో పాల్గొనేలా చేసి అటు సినిమాకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.

Advertisement