అచ్చం ఎన్టీఆర్ లాగా కనిపిస్తున్నారే.. ఆయన స్థానంలో వీరిని పెట్టి సినిమా తీసేయొచ్చు..?

ఇండియాలో ఫైనెస్ట్ యాక్టర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )టాప్ ప్లేస్‌లో నిలుస్తాడని అనడంలో సందేహం లేదు.

కామెడీ, ఎమోషనల్, రొమాంటిక్ ఇలా ఏ ఎమోషన్ అయినా అలవోకగా పలికించగల గొప్ప నటుడు ఎన్టీఆర్.

సినిమా ఇండస్ట్రీలో ఆయన లాగా ఎవరూ డైలాగ్స్‌ చెప్పలేరు.డాన్సులు వేయలేరు, ఫైట్స్ ఇరగదీయలేరు.

ఆయన మేనరిజం, స్టైల్, యాక్టింగ్ స్కిల్స్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని చెప్పవచ్చు.అయితే లుక్స్‌ పరంగా మాత్రం అతడిని మ్యాచ్ చేసే కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు.

ఎన్టీఆర్ లాగానే ఉంటారు కాబట్టి ఆయనకు బదులు వారితోనే సినిమాలు తీయొచ్చు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది.మరి అచ్చం ఎన్టీఆర్ రాగానే కనిపించే ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

• విశ్వక్ సేన్

( Vishwak Sen ) విశ్వక్ సేన్ 2017లో "వెళ్లిపోమాకే" సినిమాతో తొలిసారిగా హీరోగా నటించాడు.2019లో "ఫలక్‌నుమా దాస్" సినిమాతో( Falaknuma Das ) దర్శకుడిగా మారాడు."ఈ నగరానికి ఏమైంది", "హిట్: ది ఫస్ట్ కేస్", "ఓరి దేవుడా", "దస్ కా ధమ్కి" వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి."దస్ కా ధమ్కి"కి కూడా ఆయనే దర్శకత్వం వహించాడు.

Advertisement
Jr NTR Look Alike ,Vishwak Sen , Sai Dharam Tej, Shaminder Singh, Falaknuma Das

ఈ సినిమాలు చూస్తుంటే ఎన్టీఆర్‌నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఎందుకంటే వారిద్దరు కూడా సేమ్ ఒకేలాగా ఉంటారు.

ఫేస్ కట్, స్కిన్ కలర్, గడ్డం ఇవన్నీ చూస్తే ఇద్దరూ ట్విన్స్ ఏమో అనిపిస్తుందని కొంతమంది పేర్కొంటారు.

Jr Ntr Look Alike ,vishwak Sen , Sai Dharam Tej, Shaminder Singh, Falaknuma Das

• సాయి ధరమ్ తేజ్

( Sai Dharam Tej ) మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా చూడ్డానికి 75% ఒకే లాగా ఉంటారు.మన తెలుగు ప్రేక్షకులకు వీరి మధ్య డిఫరెన్సెస్ కనిపెట్టగలుగుతారు.కానీ ఉత్తర భారతదేశ సినిమా ప్రేక్షకులు సాయిధరమ్ తేజ్, తారక్ ఇద్దరూ ఒకరేనేమో అని పొరపాటు పడుతుంటారు.

Jr Ntr Look Alike ,vishwak Sen , Sai Dharam Tej, Shaminder Singh, Falaknuma Das

• షమీందర్ సింగ్

( Shaminder Singh )పంజాబ్‌లోని( Punjab ) భటిండా ప్రాంతానికి చెందిన షమీందర్ సింగ్ అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ లాగానే కనిపిస్తుంటాడు.ఆ విషయం ఆయనకి చాలా రోజుల దాకా తెలీదు కానీ ఫ్రెండ్స్ మాత్రం తారక్‌లా కనిపిస్తున్నావని చెప్పారట.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాడు.ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి.

Advertisement

అందులో షమీందర్‌ను చూసి ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు అని చాలామంది ఆశ్చర్యపోయారు కూడా.అయితే ఇతను హీరో లేదా నటుడు కాదు కానీ ఎన్టీఆర్ లాగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

తాజా వార్తలు